Tuesday, 8 May 2012

ఆడ పిల్ల చదువు కవరోధములు మిన్న
ఆడపిల్ల యనగ నాది శక్తి
ఆమెను చదివింప నవనికే వెలుగౌను
సంబరాజు మాట సద్ది మూట

మనసు గట్టిదగును,మర్యాదవచ్చును
మమత సమత కలుగు, మకురు తొలగు
చదువు వలన మనకు సమకూరు సకలంబు
సంబరాజు మాట సద్ది మూట

విషయమెంత జదువ విసుగును జెందక
ఒక్కసారి  వ్రాయుమోర్మి తోడ
వ్రాత ,పూత నేర్వ రత్నమై వెలిగేవు
సంబరాజు మాట సద్ది మూట

Monday, 2 April 2012


చెప్పెడి విషయంబు చెవులార విన్నచో
అర్థమగును చదువు హయినిచ్చు
అర్థమెరుగు చదువు వ్యర్థంబు గాదిల
సంబరాజు మాట సద్ది మూట

ఆడ పిల్ల చదువు కవరోధములు మిన్న
 ఆడ పిల్ల యనగ నాది శక్తి
ఆమెను చదివింప నవనికే వెలుగౌను
సంబరాజు మాట సద్ది మూట

Saturday, 31 March 2012

  వినయ శీలమున్న విద్య నీకబ్బును
విద్య వలన మనిషి విలువ పెరుగు
విలువ యున్న వ్యక్తి విబుధుందు భువిలోన
సంబరాజు మాట సద్ది మూట


పేద ధనిక యనెడి భేద భావము  లేదు
చదువు  దృష్టి యందు సమము జనులు
కలిమిలేములేవి కావులే యడ్డంకి
సంబరాజు మాట సద్ది మూట
మనసు మంచి చేయు, మంచి బుద్దిని బెంచు
మాయ మోసములను మట్టుబెట్టు
కులము,మతము తెలిపి కుటిలగుణము బాపు
సంబరాజు మాట సద్ది మూట

సంబరాజు శతకం

 

కష్ట కాలమందు కాపాడు కలిమియై
జగతిలోన యేది సాటి రాదు
ఎల్ల కాలమందు ఈడైన చెలిమికి
సంబరాజు మాట సద్ది మూట
శ్రీలవెన్ని యున్న శ్రీకారమే మిన్న
పూర్ణ రూపమదియె పుడమి  యందు
విద్య లేని ధనము విషముతో సమమౌను
 సంబరాజు మాట సద్ది మూట

Friday, 30 March 2012

జారిన అక్షరాలు నవ్వు ముఖంతో

 పడుతున్న ప్రసవ బాధల నుండి
విముక్తమై పురిటి పాపను
చూసుకున్నంత   ఆనందం
తోట్లేలో ఏడుస్తున్న పసిపాపను
లాలించే  





     

Thursday, 19 January 2012

మరణం
కొందరు కన్నీళ్ళకు చైనా గోడ
కడుతుంటారు
కొందరు దేహాల్లోకి
శోకాన్ని ఆవాహన చేస్తుంటారు
 కొందరు  నిశ్శబ్ద యోగుల్లా
మౌన ముద్ర దాల్చుతారు
మరికొందరు అగ్ని పర్వతం 
పగిలినపుడు వెదజల్లబడే  
లావాలా దుఃఖాన్ని
నడుల్లా పారిస్తుంటారు
అకస్మాత్తుగా అక్కడ నిశ్శబ్దం  పరుచుకొంటుంది
 వచ్చిన చుట్టం 
మళ్లీ అందరిలో విషాద వృక్షాన్ని
పెకిలిస్తుంది
దూరంగా కూర్చున్న కొన్ని పెదాలు
మంచి చెడుల్ని వర్గీకరిస్తుంటాయి
మరికొన్ని తలలు
ఆస్తుల్ని , అప్పుల్ని
చిట్టా పద్దులు రాస్తుంటాయి
పసిపిల్లలు జనన మరణ రహస్యాలు
చేదించిన వారిలా ఆటలాడుతుంటారు
కట్టిన చీర గురించో ,పంచె గురించో
కొత్త పద్యాలు పుడతాయి
వడ్డించిన పెద్ద చేయిపై
వ్యాఖ్యాన గ్రంథాలు ఆవిష్కరించాబడతాయి
మరణానిదీ ఒక సార్థకతే
మనసుల మధ్య మౌనం నెర్రె 
విశ్వవ్యాప్తమైన వేళ
కాసింత సేపైనా 
మనిషిని సమూహంలో చేర్చింది 
విసిరేసుకున్న చేతులను
తిరిగి తన దేహంపై
మొలకెత్తించుకున్నది 
ఇప్పుడు ఆ దేహం చుట్టూ 
కొత్తకాంతి  పరివేష్టితమై